Sakshi News home page

కశ్మీర్‌లో ఐసిస్‌ మహిళా గ్రూప్‌ కదలికలు

Published Sun, Apr 15 2018 1:30 PM

Pro-ISIS Women Group Daulat Ul Islam Active In Kashmir  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా ఐసిస్‌ అనుకూల మహిళా గ్రూప్‌ దౌలతుల్‌ ఇస్లాం కదలికలు కలకలం రేపుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో దౌలతుల్‌ ఇస్లాం కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయని హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగిన ఈ మహిళా గ్రూప్‌ ఐసిస్‌ సిద్ధాంతాలను బలపరుస్తూ ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది.

అనంత్‌నాగ్‌లో ఓ ఉగ్రవాది హతమైన క్రమంలో తొలిసారిగా కాశ్మీర్‌లో దౌలతుల్‌ ఇస్లాం సభ్యుల కార్యకలాపాలు తొలిసారిగా వెలుగుచూసినట్టు నివేదిక పేర్కొంది. ఈ ఉగ్రవాది నివాసాన్ని సందర్శించిన మహిళా గ్రూపు సభ్యులు జీహాద్‌కు అనుకూలంగా ఉద్వేగపూరిత ప్రసంగం చేసినట్టు తెలిసింది. ఈ నివేదిక నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో పెరుగుతున్న ఐసిస్‌ ప్రాబల్యం పట్ల హోంమంత్రిత్వ శాఖ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హకూరలో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు ఐసిస్‌ సభ్యులుగా భావిస్తున్నారు. వీరి పేర్లను ఐసా ఫజ్లి, సయ్యద్‌ ఓవైస్‌షా, సుల్తాన్‌ అల్‌ హైదరాబాదీలుగా చెబుతున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement